Janana Jeevana - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : JANANA JEEVANA

పల్లవి : జనన జీవన చక్రమందున "2"
ఇరుసు తానై ఇలను ఏలును

అ.ప : యుగముల దైవము, శ్రీ హరి తప్ప
వేరొక దైవము లేనే లేడు "జనన" "2"

చరణం : జీవన సంద్రము ఈదుటలో
పలు రేఇంబవళ్ళు గడచినవి "2"
మనసు మరల్పు సమయమున "2"
వయసుడుకు వేళలు, సమీపించినవి స్వామీ!
నిను జేరు వేళలు దగ్గరైనను "2"
ఇహలోక వాంఛల, మునిగితినయ, నేను "జనన"

చరణం : కూపస్థ మండూక చందమున
సంసార కూపమున మునిగితిని "2"
భువి పైన జన్మ లెన్నున్న "2"
మానుష జన్మము పరమోత్తమము, స్వామీ!
మరుజన్మ కైనను, నీ స్మరణయె తప్ప "2"
అన్యము ఎరుగక, యత్నింతునయా! "జనన"