• 7 years ago
Rahul Tripathi developed hard hands as a thick outside edge from Shane Watson off Stuart Binny flew at him at first slip. Tripathi grassed a simple offering and the match was never the same.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌(45) రాణించగా, జాస్‌ బట్లర్‌(22) మోస‍్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రేవో, కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్‌, తాహీర్‌లు తలో వికెట్‌ తీశారు.

Category

🥇
Sports

Recommended