Telugu movies Having Lot of Un Natural Scenes says Telugu Actor

  • 6 years ago
In an recent interview comedian Brahmanandam said that from last 25years he does't watch any telugu movie because of un natural scenes.

నమ్మిన సిద్దాంతానికి జీవితాంతం కట్టుబడి ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. సినీ ఇండస్ట్రీలో దర్శకుడు నారాయణమూర్తి అందుకు ఓ ఉదాహరణ. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు కోటి రూపాయలు ఆఫర్ చేసి మరీ తన సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగితే.. నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఎందుకంటే.. ఆయన పంథా వేరు. ఆయన చేయాలనుకున్న సినిమాలు వేరు. ఇక ఎందుకొచ్చిన సిద్దాంతాలు.. వీటిని నమ్ముకుంటే పైసా రాదని భావించేవాళ్లూ ఉంటారు. అందుకే.. అయిష్టంగానైనా డబ్బుల కోసం కొన్ని పనులు కానిచ్చేస్తుంటారు. చూడబోతే బ్రహ్మానందం కూడా దీన్నే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది...
బ్రహ్మానందం తెర మీద సినిమా చూసి దాదాపు 25ఏళ్లు అయిందట. ఈ మాట ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ చెప్పారు. బుద్దిజీవులు ఎవరైనా సరే, సహజంగానే తెలుగు సినిమా అసహజత్వాన్ని జీర్ణించుకోవడం కష్టం. బ్రహ్మానందం కూడా ఆ అసహజత్వపు పోకడలను చూసి.. ఎందుకొచ్చిన ఇబ్బంది అని సినిమాలను చూడటమే మానేశారట.
చాలా ఏళ్ల క్రితం ఓ సినిమా చూసేందుకని మిత్రులతో కలిసి థియేటర్ కు వెళ్లారట. సినిమాలో ప్రేమలో విఫలమైన భగ్న హీరో.. మందు బాటిల్ పట్టుకుని పాట పాడుతూ.. మధ్య మధ్యలో దగ్గుతున్న సీన్ ఒకటి వస్తోందట. ఆ టైమ్ లో బ్రహ్మానందం పక్క సీట్లో కూర్చొన్న వ్యక్తి ఒకరు.. 'అంత దగ్గు వస్తున్నప్పుడు పాట పాడటమెందుకు?.. డాక్టర్ వద్దకు వెళ్లి మందు వేసుకుని రావచ్చు కదా?' అని కామెంట్ చేశాడట. ఆ దెబ్బకు నవ్వు ఆపుకోలేకపోయారట బ్రహ్మానందం.

Recommended